Authorization
Thu May 01, 2025 05:57:27 am
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లిలో దళితవాడలో వారు పర్యటించి ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గిరికటి నిరంజన్‌గౌడ్, నాయకులు తొర్పునూరి నర్సింహాగౌడ్, పరమేశ్ పాల్గొన్నారు.