Authorization
Fri May 02, 2025 09:32:29 am
నవతెలంగాణ-పాలకవీడు
మండలకేంద్రంలో గురువారం ఆర్యవైశ్య సంఘం మండలజనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం మండలఅధ్యక్షుడిగా మాశెట్టి లక్ష్మయ్యను ఎన్నుకున్నారు. సభాధ్యక్షులుగా మాజీ అధ్యక్షులు పోలిశెట్టి రాంభిక్షం, ప్రధాన కార్యదర్శి గుండా భిక్షపతి గతంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు.అనంతరం లక్ష్మ య్య హనుమాయిగూడెంకు చెందిన విద్యార్థి లక్ష్మీ నారాయణకు ఫీజు కోసం రూ.26 వేల ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లాఅధ్యక్షులు మాశెట్టి అనంతరాములు, ఉపాధ్యక్షులు గుండా రమేష్, కందగంట్లఅనంతప్రకాశ్, కోశాధికారి ఊటుకూరి సైదయ్య, పాలకవీడు గ్రామ అధ్యక్షులు యాదా ఈశ్వరయ్య, కందగట్ల అనంత ప్రకాష్ పాల్గొన్నారు.