Authorization
Sat May 03, 2025 02:29:46 am
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-సూర్యాపేట
పేదలందలందరికీ సాగుభూములు , ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ , రాష్ట్రంలో టీఆరెస్ రెండో సారి అధికారం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కూలీలలకు ఇచ్చిన ఎన్నిక హామీలను అమలు కు సిద్ధపడటం లేదని విమర్శించారు.పాలకులు సంక్షేమ భాద్యతల నుండి తప్పు కుంటున్నారని తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు హక్కు పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీజేపీ మోడీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ను నీరుగారుస్తున్నదని, బియ్యం తప్ప మరొక వస్తువులను ఇవ్వకుండా తొక్కి పట్టిందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలపై పన్నులు వేసి బతుకు భారంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8,9తేదీలలో జిల్లా మహాసభలను నిర్వహి స్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగా జానయ్య, నారసాని వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ,పోషణ పోయిన హుస్సేన్ ,పఠాన్ మహబూబ్ అలీ పాల్గొన్నారు.