Authorization
Sat May 03, 2025 02:29:46 am
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం యాదగిరిగుట్ట కురుమ సంఘ భవనంలో తెలంగాణ రైతు సంఘం యాదగిరిగుట్ట మండల రెండవ మహాసభ నూకల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారులతో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వాటిని పరిశీలించి తగిన నష్టపరిహారాన్ని రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు విత్తనాలు ఎరువులు కల్తీ తో పంట పండించలేని పరిస్థితుల్లో రైతు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బూరి పోశెట్టి ,కొత్తపల్లి రమేష్,మిర్యాల చంద్రయ్య ,కుండే రాములు ,పర్వతాలు ,గోపాల బిక్షపతి ,గోపాల నరసింహులు ,ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.