Authorization
Sun May 04, 2025 02:22:05 am
నవతెలంగాణ-చిలుకూరు
సమాజానికి ఉపయోగపడే ట్రస్టులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించి చేయూతనందిస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని జానకినగర్ గ్రామంలో బట్టు ప్రియాంక ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టు ప్రియాంక ట్రస్ట్ గిరిజన విద్యార్థులతో పాటు సమాజంలో ప్రతిభ గల విద్యార్థులందరికీ ఉపయోగ పడాలన్నారు.అనంతరం ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు, తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ బట్టు రమేష్, టీఆర్ఎస్ నాయకులు బట్టు వెంకటేశ్వర్లు ,టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు కొండ సైదయ్య, చిలుకూరు పీఏసీఎస్ చైర్మెన్ అలసకాని జనార్దన్, జెడ్పీ కోఆప్షన్సబ్యులు ఎస్కె.జానిమియా, సర్పంచ్ నందలాల్,ఎంపీటీసీ కృష్ణచైతన్య, ట్రస్ట్ సభ్యులు,టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.