Authorization
Sat May 03, 2025 06:21:29 am
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి తిప్పర్తి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంప్‌ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంపుకు కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు ఎంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని, పరీక్షలకు అవసరం మైన అన్ని సిద్దంగా ఉంచుకోవాలని, మందులు, గ్లాస్లు వెంటనే అందించాలని, క్యాంప్‌లో ప్రజలకు ఇబ్బంది లేకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట నల్లగొండ ఆర్డీఓ జయచంద్రరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.