Authorization
Fri May 02, 2025 11:02:37 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులందరికి ఇవ్వాలని, దళిత బంధు కొరకు కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక ఎంవీఎన్భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం దళితులకు దళితబంధు ఇవ్వడం కోసం కాగితాల మీద కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు.దళిత బంధులో అర్హులను గ్రామ సభల ద్వారా గుర్తించాలే తప్ప ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి ఇవ్వొద్దన్నారు.ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి రాజకీయ జోక్యం లేకుండా దళితబంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నందిగామసైదులు,జిల్లా సహాయకార్యదర్శి పిండిగ నాగమణి, దుర్గారావు, జిల్లా నాయకులు రమణ, గిరి తదితరులు పాల్గొన్నారు.