Authorization
Sat May 03, 2025 05:22:34 am
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
పాలక ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న సూర్యాపేటలో నిర్వహిస్తున్న ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకట్ రెడ్డి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం కోరారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని, వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. బ్యాంకుల రుణ పరిమితి పెంచడంతోపాటు ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల నిండిన రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మురళి, మాజీ ఎంపీటీసీ పాశం నరసయ్య, వెంకటనారాయణ, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు :ఈనెల 26వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జే.నరసింహారావు, మండల కార్యదర్శి నాగాటి చినరాములు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు, బత్తిని వెంకటయ్య, ఎగ్గడి లింగయ్య, పిల్లి వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.