Authorization
Thu May 01, 2025 06:43:27 am
నవతెలంగాణ- చిట్యాలటౌన్
చిట్యాల పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ని ర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాఠశాలలో చేరిన చిన్నారులకు ప్రిన్సిపాల్ పెద్ది నరేందర్ ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గడ్డం విశ్వనాథ్ ,డైరెక్టర్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి ,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.