Authorization
Fri May 02, 2025 02:24:45 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. గురువారం చౌటుప్పల్ మండలకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సమావేశం రాగీరు కిష్టయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి నేపథ్యంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్ అని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వరప్రసాదిని అయిన మూసీ కాల్వ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. గ్యాస్ సబ్సిడీ తగ్గించారన్నారు. ఉపాధిహామీ చట్టం కింద నిధుల కేటాయింపు తగ్గించారన్నారు. చేసిన అప్పులకు చెల్లింపులకు అధిక నిధులు కేటాయించారని విమర్శించారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజల బడ్జెట్ కాదని, అదాని, అంబానిలాంటి ధనవంతుల బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ అంకెలగారడిగానే ఉందన్నారు. సామాన్యులకు ఉపయోగపడే విధంగా కేంద్ర బడ్జెట్ లేదన్నారు. ప్రజలపై భారం మోపే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు. దేశంలో కీలకంగా మారిన వ్యవసాయరంగానికి పెద్దపీట వేయకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండలకార్యదర్శి గంగదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, నాయకులు చీరిక సంజీవరెడ్డి, తడక మోహన్, బొజ్జ బాలయ్య పాల్గొన్నారు.