Authorization
Tue April 29, 2025 12:45:25 pm
నవతెలంగాణ-పాలకవీడు
తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు గురువారం తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా జర్నలిస్టులకు ఇస్తూ వస్తున్న హామీలను ఇప్పటికైనా ఆచరణలో పెట్టాలని కోరారు.స్వరాష్ట్రం కోసం తెలంగాణఉద్యమం ఉవ్వెత్తుగా సాగుతున్న సమయంలో, క్షేత్రస్థాయి గ్రామీణ, మండలాల్లో పాత్రికేయులు ఉద్యమలక్ష్యాలను ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న, ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితం కావడం బాధాకరమన్నారు.స్పందించిన తహసీల్దార్ పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.వినతిపత్రం అందజేసిన వారిలో పాత్రికేయులు ప్రశాంత్, వీరభద్రం, ఎస్కె గౌస్, యుగంధర్, బుచ్చయ్య, రమేష్, సైదులు తదితరులు ఉన్నారు.