Authorization
Thu May 01, 2025 09:31:38 pm
- తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రాక
- మండలంలో అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద జాతర
నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే సుంకిశాల ముత్యాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. సుంకేశాల ముత్యాలమ్మ జాతర భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే గ్రామ దేవతగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే తల్లిలా నిలుస్తుందని గిరిజనుల నమ్మకం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు సుంకిశాల గ్రామం ముంపునకు గురైంది. అసమయంలో అక్కడ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆసమయంలో అక్కడ వెలసిన ముత్యాలమ్మను పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో నిలిపారు. కానీ అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోవడంతో తిరిగి ఉమ్మడి తుంగతుర్తి పంచాయతీలోని రామన్నగూడెం తండా స్టేజి వద్ద నాగార్జునసాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. ఇక్కడ 40 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకు ఒకసారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతర కొనసాగుతొంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా
రానున్న భక్తులు
సుంకిశాల ముత్యాలమ్మ జాతరకు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా రానున్నారు జాతరలో ప్రభల అందాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలువ నున్నాయి జాతరకు నియోజకవర్గం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మూడురోజులు జరగబోయే ఈ జాతరలో వేలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. జాతరను అంగరంగవైభవంగా ముత్యాలమ్మ అమ్మ వారి జాతరను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ పూజారి మోహన్ నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా ఆలయానికి రంగులు, నూతనంగా షెడ్ నిర్మాణం, మహిళలకు స్నానపు గదులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతరకు అందాన్నిచ్చే ప్రభలు
సుంకిశాల ముత్యాలమ్మ జాతరలో ప్రభలు భక్తులకు కనువిందు చేస్తాయి. ప్రతి గిరిజనులు ఇంటింటికి అందంగా అలంకరించిన ప్రభలు ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఆలయం ముందు ఉంచుతారు. ఆప్రాంత ప్రభలతో భక్తులకు స్వాగతం పలుకుతాయి. ఈ జాతర అన్ని వర్గాల ప్రజలు రాజకీయ నాయకులతో, అధికారులతో కన్నుల పండగగా వేడుకలు జరుపుకుంటారు.