Authorization
Fri May 02, 2025 08:03:03 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్లో భాగంగా ప్రకటించిన సీనియార్టీ లిస్టులలో లోపాలు ఉన్నాయని వాటిని సవరిం చాలని, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మిరియాల దామోదర్, ముక్కెర్ల యాదయ్యలు మాట్లా డారు.పదోన్నతులు, బదిలీలలో అవకతవకలు లేకుండా సీనియార్టీ లిస్టులను తయారు చేయాలన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా కార్యదర్శి దొడ్డిస్వామి, సీనియర్ నాయకులు ఎం.దా మోదర్,వి.రమేశ్, సైదయ్య ఉన్నారు.