Authorization
Mon April 28, 2025 06:00:19 am
నవతెలంగాణ- ఆలేరుటౌన్
తెలంగాణ ఇసుక లారీ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మినిస్టర్ క్వాటర్స్‌లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ని జిల్లా ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇసుక లారీ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, వంట్టేరు మాధవ్ రెడ్డి,ఆలేరు ఇసుక లారీ అధ్యక్షులు పత్తి వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ ఆలేటి అజరు కుమార్, ప్రతాప్ రెడ్డి, చక్రిపురం అధ్యక్షులు భగవంత్ రెడ్డి, సిద్ధారెడ్డి, చందు, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.