Authorization
Fri April 25, 2025 08:40:27 am
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే వివిధ పార్టీలనాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నారమల్ల యాదయ్య, నారమల్ల రాములు, నారమల్ల ఉప్పలయ్య, నారమల్ల ప్రదీప్ లతో పాటు మరో 10మంది శనివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ఎలుగు యాదయ్య, నాయకులు ఎలుగు సోమయ్య, గుండు యాదయ్య, అంజిరెడ్డి, ఎలుగు గంగమల్లు, నేరటి అయిలయ్య, పట్టే స్వామి, రహీమ్ పాషా, వంగూరి నర్సింహ్మ, నారమల్ల బుజిలయ్య, ముక్కెర్ల అశోక్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.