Authorization
Sun April 13, 2025 09:49:00 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ ఎం
ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ బీర్ల ఐలయ్య కుల మతాలకతీతంగా బీర్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడని బీర్ల ఫౌండేషన్ మండల కన్వీనర్ బత్తిని ఉప్పలయ్యగౌడ్ తెలిపారు.సోమవారం మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గం ప్రజల కష్టసుఖాలను చూసి చలించి నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో బీర్ల ఫౌండేషన్ స్థాపించారన్నారు.తద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.గ్రామాలలోని ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కోసం నియోజకవర్గంలోని ప్రతి మండలానికి కన్వీనర్లను ఏర్పాటు చేసుకొని ప్రజలకు నిరంతరం సేవలను అందిస్తుందన్నారన్నారు.నియోజకవర్గంలోని సుమారు120 పైగా గ్రామాలకు వాటర్ప్లాంట్లను, పేద ప్రజలకు వాటర్క్యాన్లను పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయంగా పనిచేస్తున్న బీర్ల ఐలయ్యను ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు.