Authorization
Thu April 10, 2025 08:00:54 am
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు లక్ష్య సాధన అవసరమని ఏకశిలా విద్యాలయాల కరస్పాండెంట్ చిర్ర ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం (వి ఆర్) వెంకటరమణ కళాశాల విద్యార్థుల ప్రెషర్ డే కళాశాల ప్రిన్సిపాల్ నాలం అయ్యప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం కఠోరంగా శ్రమిస్తే, లక్ష్య సాధన వైపు సులువుగా ప్రయాణించి ,తక్కువ సమయంలో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు అని చెప్పారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిర్ర ఉపేందర్ రెడ్డిని శాలువా,మేమేంటతో ఘనంగా సన్మానించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మెన్ కటకం వెంకటరామయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఉప్పల్ రాజు, అధ్యాపకులు కృష్ణ కుమార్,పరశురాములు,కమలాకర్,మధుసూదన్, భాస్కర్, వీరాచారి, ఉపాచారి, మానస, సునంద, నాగేశ్వర్, యశ్వంత్, స్వాతి, స్రవంతి, సింధు పాల్గొన్నారు.