Authorization
Thu April 10, 2025 01:18:48 am
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఏప్రిల్ మూడో తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు రూట్ ఆఫీసర్, మండల విద్యాధికారి పి.చత్రు నాయక్ ద్వారా స్వీకరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించి ట్రంకు పెట్టెలను సీల్ చేసి కట్టుదిట్టమైన భద్రత కొరకు పోలీస్ స్టేషన్లో భద్రపరిచామని పరీక్షాకేంద్రాల చీఫ్ ఎల్.శ్రీనివాసరావు,ఎన్. శ్రీనివాసరావులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంటల్ అధికారులు వై.వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, వీరనారాయణ,సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు.