Authorization
Thu April 10, 2025 02:10:07 pm
నవతెలంగాణ - భువనగిరి
భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పట్టణకేంద్రంలో నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచ ఏశారు. బుధవారం పురపాలక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ౌన్సిల్ పాలకవర్గం ఏర్పాటు అయినప్పటి నుండి పార్టీలకతీతంగా గౌరవ కౌన్సిలర్ల ఆత్మాభిమానం దెబ్బతిందన్నారు. కనీసం చిన్న చిన్న పనులైన లైట్లు పారిశుభ్రత నీటి సరఫరా తన ప్రజల చిరకాల వాంఛ అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఏర్పాటులో వీధి కుక్కలు, కోతులు, పందుల నివారణలో కూడా కౌన్సిలర్లు విఫలయ్యారనే అపవాదు మోస్తున్నామన్నారు. పూర్తిగా మున్సిపల్ చైర్మెన్ కమిషనర్లు వహించాలని కౌన్సిలర్స్ గౌరవాన్ని కాపాడే బాధ్యత పాలకవర్గంలోని అధికార పార్టీకి చెందిన వారిదేనన్నారు.ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమయం పట్టణానికి కేటాయించాలన్నారు. పట్టణంలోని పహాడి నగర్ కు చెందిన బాలునిపై ఇది కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం పట్టణానికి ఒక మచ్చ లాంటిదన్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, పడిగల రేణుక ప్రదీప్, కైరంకొండ వెంకటేష్, తంగేళ్లపల్లి శ్రీవాణి, పచ్చర్ల హేమలత జగన్, వడిచర్ల లక్ష్మీ కష్ణ యాదవ్ పాల్గొన్నారు.