Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని కాపుగల్లు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీకూలీలతో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వేలది పద్మావతి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధికూలీల సమస్యలను పరిష్కరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధికూలీలు,మేట్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి...
పట్టణంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 132వ జయంతి నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెల్ది పద్మావతి, టౌన్ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, వెంకన్న, ఏసోబు, ఉపేందర్,సైదులు,సత్తిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా వాడవాడలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్, దళిత నాయకులతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలిసి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం హుజూర్ నగర్ రోడ్డులో గల అంబేద్కర్ వద్ద కోదాడ పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను పట్టణంలోని కోర్టు లో అంబేడ్కర్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్‌నాయుడు, సెక్రెటరీ సాధు శరత్‌బాబుతో పాటు పలువురు లాయర్లు పూలమాలలేసి నివాళులర్పించారు.మండలపరిధిలోని గణపవరం గ్రామంలోని శ్రీవరవర రంగనాయక భాషా నిలయం గ్రంథాలయం గణపవరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా గ్రంథాలయ చైర్మెన్ వట్టికూటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.