Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలలుగా అందని వేతనాలు
- వేతనాలు చెల్లించాలి
- జిల్లా అధ్యక్షులు కుకునూరు జలంధర్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ లెక్చరర్లకు సమానంగా పోటీ పడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న అతిథి అధ్యాపకులు ప్రభుత్వ విధానాల వల్ల సమయానికి వేతనాలు అందక అన్నమో రామచంద్ర అంటూ వేడుకుంటున్న పరిస్థితి దాపరించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వజూనియర్ కళాశాలల్లో 1,654 మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 133 మంది అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 56 మంది యాదాద్రి భువనగిరి జిల్లాలో 36 మంది సూర్యాపేట జిల్లాలో 41 మంది మొత్తం 133 మంది పనిచేస్తున్నారు.
అతిథి అధ్యాపకుల వ్యవస్థ ప్రారంభమైంది ఇలా
తెలంగాణ రాష్ట్రంలోని నేడు అనేక ప్రభుత్వ అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్స్) నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2012 లో గెస్ట్ లెక్చరర్స్ ఉద్యోగ వ్యవస్థని ప్రారంభించారు. ప్రారంభంలో పీరియడ్‌కి కేవలం రూ. 150 చొప్పున నెలకు 72 పీరియడ్స్ మాత్రమే బోధించే వెసులుబాటు గెస్ట్ లెక్చరర్స్కి లభించేది. ఆ రకంగా వారు నెలకు కేవలం రూ.10,800 ఆర్జిస్తూ ఆ ఉద్యోగాల్లో బతుకులు భారంగా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చొరవతో పీరియడ్‌కి రూ.300 పెరగడంతో నెలకి రూ.21,600 లకు పెరిగాయి. కాలక్రమేణా ఈ మొత్తం రూ.28,000 లకు పెరిగిన ధరలు చుక్కలనంటుకుంటున్న ప్రస్తుత రోజుల్లో ఆ చాలీచాలని జీతాలు ఏమాత్రం సరిపోక వారు మరింతగా అప్పులపాలు కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. 2018 నుంచి ప్రభుత్వమే నిర్దిష్ట త్రీమెన్ కమిటీతో ఇంటర్వ్యూలు, డెమోలు నిర్వహించి వివాదాలకుతావులేకుండా గెస్ట్ లెక్చరర్ఎంపిక ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. గతంలో గెస్ట్ లెక్చరర్స్ ఆటో రెన్యువల్ చేసేవారు. కానీ నేడు కనీసం ఆటో రెన్యూవల్ కూడా చేయడం లేదు' అని గెస్ట్రక్చరర్స్ గోస వెలిబు చ్చుకుంటున్నారు. విద్యా సంవత్సరం ముగిసిన ఆరు నెలలుగా అందనీ వేతనాలు. నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్స్ గత 6 నెలలుగా జీతాలు లేక అనేక అవస్థలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే 133 గెస్ట్ లెక్చరర్స్ పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం
అతిధిఅధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు కుకునూరు జలంధర్‌రెడ్డి
విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఆరు నెలలుగా అతిధి అధ్యాపకులకు నేటికీ వేతనాలు అందలేదు. నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో ఆ ర్దికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వేతనాలు వెంటనే చెల్లించాలి
నడింపల్లి వెంకటేశ్వర్లు (అధ్యాపకుడు)
అతిధి అధ్యాపకులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని అధ్యాపకులు నడింపల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న అతిథి అధ్యాపకులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం.