Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను కఠినంగా శిక్షించాలి
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి
నవతెలంగాణ-హలియా
మహిళలపై అఘాయిత్యాలను ఖండించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఆదివారం హాలియా మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తిరుమలగిరి సాగర్ మండలంలో కొంపెల్లి గ్రామంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరం. కొంపెల్లి గ్రామానికి చెందిన దీపికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేసి తనకు సంబంధం లేదని మోసగించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోగా దౌర్జన్యానికి దిగి మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. దీపిక నిందితుడి ఇంటిముందు మౌన పోరాటానికి దిగిందని తెలిపారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంను ఆశ్రయించి బాధితురాలికి అండగా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, సహాయ కార్యదర్శి ధనలక్ష్మి బాధితురాలి వెంట అంగడా నిలబడ్డారు. విచక్షణారహితంగా దీపికను తల పగలగొట్టారని, మహిళా సంఘం నాయకురాలపై చేయి చేసుకున్నారని తెలిపారు. ఉదయమే ఎస్సైకి, సీఐకి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. తాము నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఘటనా స్థలానికి రాలేదని ఆరోపించారు. జిల్లా ఎస్పీని కలిసి సమస్యలను విన్నవిస్తామని చెప్పారు. నిందితులను కఠింనగా శిక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి దైద జానకమ్మ, ధనలక్ష్మి పాల్గొన్నారు.