Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లాలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస సంఘటనలు దాడులు, హత్యలు హత్యాచారాలు, వేధింపులు ప్రేమ పేరుతో మోసగించటం, వదిలేయటం గృహహింస పాలు పడుతున్న సంఘటనలు పట్ల సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కే .అపూర్వరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళలు పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం జరగడం లేదు. నిందితుల పక్షాన నిలబడుతున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. నిందితులకు సరియైన కౌన్సిలింగ్ ఇవ్వక చట్టంపై అవగాహన లేక వరుస సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తిరుమలగిరిసాగర్ మండల పరిధి కొంపల్లి గ్రామంలో జరిగిన ఘటన లింగాల సాయి ప్రేమ పేరుతో వడ్డే మల్లె దీపికను మోసం చేసిన సంఘటనను వివరించారు. మూడు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక బిడ్డకు తల్లిని చేసి పెళ్లి చేసుకోనని మోసం చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శులు జిట్టా సరోజ, చేనబోయిన నాగమణి, భూతం అరుణకుమారి, కారంపొడి ధనలక్ష్మి, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, బహురోజు ఇందిరా, హుస్సేనా జంజీరాల ఉమా, తదితరులు పాల్గొన్నారు.