Authorization
Thu April 10, 2025 06:49:06 am
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ-చండూర్
ఈనెల 30న జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. సోమవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం వలనే నిత్యవసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్, క్రిమి సింహారక మందులు, వస్తువులు బాగా పెరిగిపోయాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, మండల కమిటీ సభ్యులు పగిళ్ల శ్రీనివాస్, కర్నాటి సుధాకర్, కుక్కునూరు నగేష్, ఖమ్మం రాములు, బుట్ట శివకుమార్, అచ్చిని శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.