Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు నూతన ఎస్హెచ్ఓ, ఎస్ఐగా అదనపు ఎస్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న, జి.వెంకట శ్రీనివాస్ ఆలేరు పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో, ఇప్పటివరకు ఎస్ఐగా విధులు నిర్వహించిన ఎండి ఇద్రిస్ అలీ నుండి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సైగా విధులు నిర్వహించిన ఇద్రిస్ అలీ హైదరాబాదులోని ఎల్బీనగర్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పక్షాల నాయకుల సహకారం మరువలేనిదని చెప్పారు. విధులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం ఇద్రిస్‌అలీ, వెంకటశ్రీనివాస్ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యేలుగల కుమారస్వామి, మంగ వెంకటేష్, గుండు మధు, గుండు మహేందర్,కుళ్ల సిద్ధులు, శ్రావణ్,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్‌గౌడ్, తూర్పుగూడెం సర్పంచ్ వంగాల శ్రీశైలం, ఆలేరు పట్టణ మాజీ సర్పంచ్ చింతకింది మురళి, ఆత్మ కమిటీ డైరెక్టర్ జల్లి నర్సింహులు,పట్టణ ప్రధానకార్యదర్శులు పాశికంటి శ్రీనివాస్,ఎస్.సంతోష్, పత్తి వెంకటేష్ ,పట్టణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూతాటి అంజన్‌కుమార్,అధికార ప్రతినిధి ముదిగొండిశీకాంత్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బెదరకోట దుర్గేష్,మోర్తాల రమణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు పూలశ్రవణ్,దయ్యాల సంపత్, ఫయాజ్,మాడిశెట్టి హేమేందర్ ,మహమూద్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బింగి గణేష్, ఎర్రప్రశాంత్, సోషల్‌మీడియా కన్వీనర్ జమాల్, అందె నరేష్, కడకంచి నరేందర్ , పొన్నాల శ్రీకాంత్ , జూకంటి రాజు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.