Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు మున్సిపల్ లో అండర్ పాస్ నిర్మాణం కోసం చేపట్టే బీజేపీ చేసే దీక్షలు, రాజకీయ లబ్ది కోసమేని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ అన్నారు.ఆదివారం పట్టణ కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపును ముట్టడించడం హాస్యపదమైన విషయమని తెలిపారు. అండర్‌పాస్‌లో ఇండ్లు కోల్పోయిన లబ్దిదారులకు,వారి ఖాతాలలోనూ డబ్బులు జమ చేశారన్నారు.ఇండ్లు కోల్పోయిన లబ్దిదారులకు ప్లాట్లు అందజేశారన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డిలను ఎదుర్కోలేకపోవడంతో రాజీనామా చేయమనడం తగదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు కాలేశ్వరం జాతీయహోదాను, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని, నిమ్స్‌గా ఉన్న ఎయిమ్స్ కొన్నేండ్లుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. అందుకు కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఆలేరు మున్సిపల్ రూ.20 వేల కోట్ల అభివద్ధితో పనులు చేస్తుంటే ఓర్వలేకనే విమర్శిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్ బేతి రాములు, పట్టణ మాజీ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్, మాజీసర్పంచ్ చింతకింది మురళి, దాసి సంతోష్, జెల్లీ నర్సింహులు, పూల శ్రవణ్, ముదిగొండ శ్రీకాంత్, రమణారెడ్డి, పత్తి వెంకటేష్, దయ్యాల సంపత్, మూర్ఛాల రమణారెడ్డి, ఎండి ఫయాజ్, జమాల్, టింకు,బింగి సంతోష్, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.