Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
మండలంలోని నారాయణపురం-వాయిళ్ళపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారు.ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు మునుగోడు ఉపఎన్నికలకు ముందు మరమ్మతుపనులను ప్రారంభించినా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు మరమ్మతుపనులను పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు.దీంతో వాహనదారులే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహ వినియోగదారులు నిత్యం దుమ్ము ధూళి కంకరరాళ్లదెబ్బలకు గురవుతున్నారు.ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే సంబంధిత కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి..వెంటనే పూర్తి చేయాలి(డీవైఎఫ్ఐ నాయకులు కర్నాటి సుధాకర్) రోడ్డు మరమ్మతుపనులు పూర్తి చేయకుండా సంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రయాణికులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అనేక మంది వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ కిందపడి గాయాలకు గురవుతున్నారు.రోడ్డుపై పోసిన కంకర రాళ్లు ఒత్తుకొని ద్విచక్ర వాహనాలు పంచర్లకు గురవుతున్నాయి.స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సంబంధిత కాంట్రాక్ట్ తోటి త్వరగా పనులు పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.