Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేకకథనం
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శిష్యునిగా, వ్యక్తిగత కార్యదర్శిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బీఆర్ఎస్ ఆలేరు ఉద్యమసారథిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్‌గా తనదైన ముద్ర వేసుకుంటూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రైతు బిడ్డగా, రైతు కష్టాన్ని ఎరిగి చైర్మెన్‌గా విధులు నిర్వహిస్తున్న గొంగిడి మహేందర్‌రెడ్డి, తనదైన శైలిలో రాజకీయంగా ఆలేరు నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నారు.
నేడు మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ఆలేరు నియోజకవర్గంలో గ్రామ, గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు సోమవారం జరిగే గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతకు భర్తగా ఎప్పుడు అండదండగా ఉంటూ , నియోజకవర్గంలోని ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా, గొంగిడి మహేందర్ రెడ్డి కార్యకర్తలకు ప్రజలక అండగా ఉంటూ కష్ట సుఖాలలో నేనున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తున్న నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి. ప్రతినిత్యం నియోజకవర్గంలోని గ్రామగ్రామాన ప్రజల మధ్యన ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది.40ఏండ్లుగా సింగిల్‌విండో డైరెక్టర్‌గా మొదలుకొని డీసీసీబీ చైర్మెన్‌గా,టెస్కాబ్ రాష్ట్ర వాయిస్చైర్మెన్గా అంచెలంచెలుగా, వివిధ పదవులు చేపట్టి, ఎదుగుతున్న తీరు ప్రశంసనీయం.ముఖ్యమంత్రి కెేసీఆర్,పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డికి, జిల్లాలోని 12 మంది శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు నమ్మకంగా ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతలను
నిర్వర్తిస్తాడు.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం గొంగిడిది
ప్రీమియర్ ఎక్స్ప్లోస్ కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల పక్షాన, యజమాన్యంతో మాట్లాడుతూ, పని చేస్తూ, తనదైన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు.డీసీసీబీ చైర్మెన్‌గా రైతులకు అండదండగా ఉంటూ రైతుల పిల్లలు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారికి, చిరువ్యాపారులకు, వృత్తిదారులకు, డీసీసీబీ బ్యాంకు ద్వారా రుణసదుపాయం కల్పిస్తూ రూ.900 కోట్ల టర్నోవర్ అప్పులఊబిలో ఉన్న సహకారబ్యాంకును రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచేలా బ్యాంకును లాభాలబాటలోకి తీసుకొచ్చారు.రైతులకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు, బ్యాంకు సిబ్బందికి, సేవలు మరింత చేరువ చేసేందుకు రైతుల వద్దకే బ్యాంకు అనే నినాదంతో ఏటీఎం వాహనాన్ని తీసుకువచ్చారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుల సౌకర్యార్థం మరో ఆరు సహకారబ్యాంకు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు.రైతునేస్తంగా మారారు.బ్యాంకు ఉద్యోగులకు సైతం సకాలంలో వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటూ మహిసార్గా, అన్నగా అభిమానులను సన్నిహితులను సంపాదించుకున్నారు.గొంగిడి మహేందర్‌రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, డీసీసీబీ బ్యాంకు ఉద్యోగులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు.