Authorization
Sun April 06, 2025 09:09:34 am
- బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్
నవతెలంగాణ-నల్లగొండ
బీహార్లో కుల గణాంకాలపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీల మనోభావాలను కించపరచడమేనని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోలు దీపేందర్ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 సంవత్సరంలో జరగాల్సిన వెనకబడిన కులాల జనాభా లెక్కల సేకరణ కరోనా మహ్మమారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నేటికీ కులగణన చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మండల కమీషన్ సిఫారసులో భాగంగా ఎస్సీ, ఎస్టీ తరహాలో ఓబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఓబీసీలకు జరిగే అన్యాయంపై రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీసీలు ఏకమై బీసీ జనాభగణనపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.