Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మెన్ గుత్తా అమిత్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
యువతరం యాప్‌ను నిరుద్యోగులు సద్వినియం తీసుకోవాలని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. గుత్తా యాప్ విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో కరదీపిక వంటిదని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన యాప్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ సీహెచ్.గోపాల్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత కోసం ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు తమ ట్రస్ట్ నల్లగొండ యువతరం అమిత్ గుత్తా యాప్‌ను రూపొందించిందన్నారు. అన్ని పోటీ పరీక్షల నిరుద్యోగ యువతకు ట్రస్ట్ అధ్వర్యంలో ఉచిత కోచింగ్‌లు అందిస్తున్నామని, ఇప్పుడు ఆన్ లైన్లో ఫ్రీ కోచింగ్ కోసం యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. నిరుద్యోగ యువత యాప్‌ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ సాధనలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసి సీహెచ్. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల విద్యార్థులకు ఇలాంటి ఉచిత యాప్‌లు ఎంతో ఉపయోగపడతాయని నిరుద్యోగులు వీటిని సద్వినియం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రావణ్‌కుమార్, కౌన్సిలర్లు యామ దయాకర్, బషీరుద్దీన్, ఆర్య వైశ్యులు సంఘం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, అయితగాని స్వామిగౌడ్, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, హరికృష్ణ, ఫ్యాకల్టీ శ్రీనివాస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు నిరుద్యోగులు భారీగా తరలొచ్చారు.