Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియాంకా గాంధీ సభకు తరలిరండి
నవతెలంగాణ-నకిరేకల్
ఈనెల 8న హైదరాబాదులోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే నిరుద్యోగ యువ సంఘర్షణ సభకు తరలిరావాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి పెరిగిపోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుపై మాట్లాడిన తీరు హస్యాస్పదమన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషితోనే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, యాస కర్ణాకర్రెడ్డి, బొప్పని యాదగిరి, బడుగుల చంద్ర శేఖర్యాదవ్, కొమ్ము యాదయ్య, కొండ అంజమ్మ, సిరిగి జ్యోతి, ఆవుల వేణు, మాచర్ల సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.