Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్యాణ లక్ష్మీ పథకం అని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.సోమవారం చింతపల్లి మండలానికి 10మందికి రూ.10లక్షల విలువైన కల్యాణలక్ష్మీ చెక్కులు, చీరలను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కళ్యాణ లక్ష్మీ పేదలకు వరంలాంటిదన్నారు.సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని కొనియాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయన్నారు..ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్‌రెడ్డి,ఎంపీపీ కొండూరు భవాని పవన్,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి,రైతుబంధుమండల అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు,మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గొపిడి కిష్టారెడ్డి,బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి,సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొండల్నాయక్,మండల ఉపాధ్యక్షులు ఎల్లంకి అశోక్, బీఆర్ఎస్ నాయకులు మాస భాస్కర్, కొండూరు శ్రీనివాస్, కాయితి బచ్చిరెడ్డి, బాదేపల్లి నీరంజన్,యం.డి.ఖాలేద్, పురుషోత్తంరెడ్డి,తహసీల్దార్ విశాలాక్ష్మి, పాల్గొన్నారు.