Authorization
Sun April 06, 2025 02:51:55 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ మేడిపల్లి వేణు అన్నారు.సోమవారం మండల పరిధిలోని బండరామారం గ్రామంలో జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు కంటి వెలుగు పై సాంస్కృతిక కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించి మాట్లాడారు.ఈ సందర్భంగా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కంటి వెలుగు కార్యక్రమమన్నారు.సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, వివిధ శాఖలపై అవగాహన సంక్షేమ పథకాలపై కళాబృందంచే ఆటాపాట, మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ,గడ్డం ఉదరు, పాలకుర్తి శ్రీకాంత్ ,రాములు, ఉపేందర్, లక్ష్మణ్, మంజుల, నాగలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.