Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండల పరిధిలోని దూపాడు గ్రామంలోని మెల్లపల్లి లక్ష్మీనర్సయ్య క్షేత్రంలో భూసార పరీక్షకి మట్టి నమూనా సేకరణపై రైౖతులకు అవగాహన కల్పించామని గడ్డిపల్లి కేవీకే మృత్తిక శాస్త్రవేత్త ఏ.కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన సోమవారం మట్టి నమూనా సేకరించే విధానం, వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ యొక్క యాజమాన్య పద్ధతులు, పోషకాల లభ్యత పరిమాణంపై ఉదజని సూచిక ప్రభావం, ఆమ్ల చౌడు నేలలు పునరుద్ధరించే పద్ధతులు, పచ్చిరొట్ట ఎరువులు ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతుల్లో భూసారాన్ని పెంచే పద్ధతులు తదితర విషయాలను వివరించారు. అనంతరం మట్టినమూనా సేకరించే విధానాన్ని చూపించారు.ఈ కార్యక్రమంలో సరయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థినులు హేమలత, దీక్షిత, దివ్య, స్నేహ, మౌనేశ్వరి, రైతులు జానకిరామయ్య, అనిల్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.