Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
పేదప్రజలకు ఎల్లప్పుడు ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి అనంతప్రకాష్ తెలిపారు.మండలంలోని మహంకాళి గూడెంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా ఎర్రజెండాను ఎగురవేసి మాట్లాడారు.కార్మికులకు, కర్షకులకు, యువజన, మహిళా సమస్యలపై నిరంతరం పోరాడేది వామపక్షాలేనని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 42 కార్మిక చట్టాలను నాలుగుకోడ్లుగా చేస్తూ కార్మికహక్కులను హరించి వేసిందన్నారు.అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానమని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముశం నర్సింహ, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు రమేష్, మాలవత్ నాగు, హుస్సేన్, విజయరాజు, చెన్నయ్య, అంకమరావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.