Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నిజాయితీ గల నాయకుడు, కార్మిక నాయకుడు పచ్చి మట్టల పెంటయ్య స్ఫూర్తితో కార్మికులను ఐక్య పర్చి కార్మిక సమస్యలపై నిరంతరం పొరడినప్పుడే పెంటయ్య ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.పెంటయ్య రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ హమాలీ వృత్తితో సూర్యాపేటకు వచ్చిన పెంటయ్య సీఐటీయూ సూర్యాపేట తాలూకా అధ్యక్షుడుగా,సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శిగా పని చేశారన్నారు.2000లో జరిగిన సుందరయ్యనగర్ ఇండ్ల స్థలాలు పోరాటంలో పోలీసులు దెబ్బలు కొట్టి నిర్బంధాలు పెట్టి అక్రమంగా కేసులు పెట్టిన బెదరకుండా పేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకూ పోరాడిన వ్యక్తి పెంటయ్య అని ఆయన కొనియాడారు.నీతికి నిజయితీకి మారు పేరు గా నిరంతరం కార్మికులతో సంభంధాలు పెట్టుకొని పని చేశారని ఆయన పేర్కొన్నారు.జిల్లాలో సీఐటీయూ నిర్మాణం లో ఆయన పాత్ర గొప్పదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోటగోపి,ఎల్ఐసీ యూనియన్ అధ్యక్షుడు ప్రభాకర్, సీఐటీయూ టౌన్ కన్వీనర్ మామిడి సుందరయ్య, జిల్లా కమిటీ సభ్యులు సాయికుమార్, వెలుపుల వెంకన్న, మడ్డి అంజిబాబు, చాంద్‌పాషా, మచ్చ సంజీవ తదితరులు పాల్గొన్నారు.అనంతరం వ్యవసాయ మార్కెట్లో హమాలీలు పెంటయ్య వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బద్రు, ఉపేందర్, రాఘవులు, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.