Authorization
Sun April 06, 2025 02:19:34 pm
నవతెలంగాణ- మోటకొండూర్
మోటకొండూరు గీత సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గానికి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలునిర్వహించారు. గతంలో ఎన్నికైన పాలకవర్గాన్ని ధిక్కరిస్తూ ఎన్నికల కమిషన్ ద్వారా నిర్వహించిన ఎన్నికలలో పాల్గొని మాట తప్పిన ప్యానల్ ను ఓడిస్తూ గతంలో ఎన్నికైన పాలక వర్గాన్ని మళ్లీ గెలిపించారు. కల్లుగీత సహకార సంఘం సభ్యులందరికీ ఆ సంఘం జిల్లా కమిటీ తరుపున ఆయన హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.