Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రంజాన్‌ మాసంలో శుభ పరిణామాలు! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 15,2023

రంజాన్‌ మాసంలో శుభ పరిణామాలు!

         వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్‌ బాధిత పాలస్తీనా హమస్‌ వంటి తిరుగుబాటు బృందాలు, శక్తులకు ఇటీవలి కాలంలో ఇరాన్‌ పెద్ద ఎత్తున అండదండగా ఉంది. సౌదీతో సర్దుబాటు కుదిరినందున రానున్న రోజుల్లో మరింతగా కేంద్రీకరించవచ్చు. దీనికి తోడు చైనా, రష్యా ప్రభావం పెరగటాన్ని అమెరికా సహించటం లేదు. సౌదీ-ఇరాన్‌ ఒప్పందాన్ని మొక్కుబడిగా మంచిదేగా అని వర్ణించింది.
రానున్న రోజుల్లో ఏదో ఒక సాకు చూపి ఇజ్రాయెల్‌ ద్వారా మరిన్ని దాడులకు తెగబడినా ఆశ్చర్యం లేదు
           ఇరాన్‌, సిరియా ప్రతినిధులు సౌదీ అరేబియా గడ్డమీద అడుగుపెట్టటం, అదీ ఒకే రోజున కొద్ది నెలల క్రితం దుర్బలమైన, అసలు ఊహకే అందని అంశం. అలాంటిది జరిగిందని, ఇది కలా నిజమా అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. నిజమే చైనా మధ్యవర్తిత్వంలో నెల రోజుల క్రితం ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం ఊరికే ప్రకటనలకేనా ఒక్క అడుగైనా ముందుకు సాగుతుందా, ప్రచారానికే పరిమితం అంటూ పశ్చిమ దేశాల మీడియా అనుమానాలు, సందేహాలను కలిగిస్తూ కథనాలు రాసిన నేపధ్యంలో నెల రోజుల్లోగానే ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించటం అరబ్బు, పశ్చిమాసియాలో శాంతిని కోరుకొనే వారికి సంతోషం పుల్లలు పెట్టేవారికి విషాదంగా మారటంలో ఆశ్చర్యం లేదు. అందునా ముస్లింలు ముఖ్యమైనదిగా భావించే రంజాన్‌ మాసంలో జరుగుతున్న సానుకూల పరిణామాలు సహజంగానే అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్‌ ఇతర కొన్ని దేశాలకు రుచించటం లేదు. అందుకే కట్టుకథలను ప్రచారంలో పెట్టారు.
తమ ప్రతినిధి వర్గం రియాద్‌(సౌదీ అరేబియా రాజధాని) గడ్డ మీద అడుగుపెట్టినట్లు బుధవారంనాడు ఇరాన్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఎర్ర సముద్ర తీర సౌదీ నగరమైన జెడ్డాకు పన్నెండు సంవత్సరాల తరువాత తొలిసారిగా సిరియా విదేశాంగ మంత్రి వచ్చినట్లు సౌదీ ప్రకటించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిరియా, ఎమెన్‌ సంక్షోభ పరిష్కారానికి దోహదం చేసే పరిణామాలకు ఇది సంకేతంగా భావిస్తున్నారు. సౌదీ-సిరియా మంత్రులు సిరియా సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరిపారు. ఈ పరిణామం తిరిగి సిరియా అరబ్బు ప్రపంచంలోకి అడుగుపెట్టటంతో పాటు తటస్థ పాత్రను పోషిస్తుందని సౌదీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఐక్యత, భద్రత, సిరియా భద్రత గురించి చర్చించటంతో పాటు ఇరుదేశాలు దౌత్య సంబంధాలతో పాటు విమాన సర్వీసులను కూడా పునరుద్దరించాలని నిర్ణయించాయి. వచ్చే నెలలో జరిగే అరబ్‌ లీగ్‌ సమావేశానికి సిరియా అధినేత బషర్‌ అల్‌ అసాద్‌ రాకకు వీలు కల్పించేందుకు శుక్రవారంనాడు జెడ్డాలో లీగ్‌ ప్రతినిధుల సమావేశం జరగనుంది. దాని కంటే ముందే సిరియా మంత్రి సౌదీ వచ్చాడు. రియాద్‌లో ఇరాన్‌ రాయబార కార్యాలయంతో పాటు జెడ్డాలో కాన్సులేట్‌ జనరల్‌ ఏర్పాటు గురించి ఇరాన్‌ ప్రతినిధి వర్గం చర్చిస్తున్నది. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైసీ తమ దేశ పర్యటనకు రావాలని సౌదీ ఆహ్వానం పంపింది. ఆ లోగా ఇవన్నీ పూర్తవుతాయి.
ఎమెన్‌ అంతర్యుద్దంలో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదార్లను అణిచేందుకు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇతర దేశాలను కలుపుకొని సౌదీ అరేబియా మిలిటరీ జోక్యం చేసుకుంటున్నది. ఇప్పుడు దానికి కూడా తెరపడే పరిణామాలు జరుగుతున్నాయి. రాజధాని సనాతో సహా అత్యధిక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తిరుగుబాటుదార్లు తెచ్చుకున్నారు.సౌదీ రాయ బారి సనా వెళ్లి తిరుగుబాటుదార్లతో చర్చలు జరిపి పదవీచ్యుతు లైన పాలకులతో ఒక రాజకీయ పరిష్కారం కుదిర్చేందుకు చర్చలు జరుపుతారు. ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న మిలిటరీ చర్యలను నిలిపివేసి తన ఆర్థిక వ్యవస్థను చక్కపరుచుకోవాలని సౌదీ నిర్ణయించుకుంది.
ఈ పరిణామాల పూర్వరంగంలో అమెరికా ఎత్తుగడలో భాగంగా ఇజ్రాయెల్‌ గత కొద్ది రోజులుగా సిరియా ఇతర ప్రాంతాల మీద దాడులకు దిగి రెచ్చగొడుతోంది.ఇటీవల సిరియాలో ఫిబ్రవరి ఆరున సంభవించిన భూకంప బాధితులకు ఇరాన్‌ పంపుతున్న సాయాన్ని మిలిటరీ పరికరాలు,ఆయుధాలు అందచేయటంగా పెద్ద ఎత్తున ప్రచారదాడికి దిగారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా అలాంటి తప్పుడు పనులు చేయటంలో ఆరితేరిన వారి నుంచి ఇంతకంటే భిన్నంగా ఊహించలేం. దీన్ని సాకుగా చూపుతున్న ఇజ్రాయెల్‌ సిరియా లోని అలెప్పో విమానాశ్రయం, అల్‌దాబ్‌ వైమానిక కేంద్రంపై దాడులు కూడా జరిపింది. పశ్చిమాసియా, అరబ్బు ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు. వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్‌ బాధిత పాలస్తీనా హమస్‌ వంటి తిరుగుబాటు బృందాలు, శక్తులకు ఇటీవలి కాలంలో ఇరాన్‌ పెద్ద ఎత్తున అండదండగా ఉంది. సౌదీతో సర్దుబాటు కుదిరినందున రానున్న రోజుల్లో మరింతగా కేంద్రీకరించవచ్చు. దీనికి తోడు చైనా, రష్యా ప్రభావం పెరగటాన్ని అమెరికా సహించటం లేదు. సౌదీ-ఇరాన్‌ ఒప్పందాన్ని మొక్కుబడిగా మంచిదేగా అని వర్ణించింది. రానున్న రోజుల్లో ఏదో ఒక సాకు చూపి ఇజ్రాయెల్‌ ద్వారా మరిన్ని దాడులకు తెగబడినా ఆశ్చర్యం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'జన్‌ధన్‌' కనుమరుగయ్యెన్‌
తాను తీసుకున్న గోతిలోనే...
ప్రేమను పంచుదాం...
చెంపపెట్టు...
ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!
గొయ్యిని పూడ్చేదెవరు?
మణిపూర్‌... మరో రోమ్‌
దాచేస్తే దాగని సత్యం!
ఏడ్పులు... వేషాలు
ఎ ఫిల్మ్‌ బై 'సంఘ్‌పరివార్‌'
రెచ్చగొట్టే పశ్చిమ దేశాల మరో దుష్టయత్నం!
కర్‌'నాటక' ఎజెండా!
వన్‌ వే ట్రాఫిక్‌
సూడాన్‌లో మనోళ్లు సురక్షితమేనా?
ఎర్రెర్ర‌ని దారుల్లో‌
సిగ్గు సిగ్గు!
ఆ తీర్పుపై నీళ్లు..!
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి చైనా చొరవ!
బిల్లులపై ఇదేం పద్ధతి..?
సైన్స్‌పై దాడి
ప్రపంచ గూఢచారి!
''నేరం'' విడుదల!
జనాభాలో చైనాను అధిగమిస్తే ఒరిగేదేమిటి?
'పుల్వామా'లో అసలేం జరిగింది?
'లైవ్‌ కిల్లింగ్స్‌'
'సిగ్గు'కే సిగ్గేసింది!
కళ నిజమౌనులే !
సజీవుడు అంబేద్కర్‌!
మళ్లీ 'ఉరే'నియం...
నిఘా నీడలో...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.