Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏడ్పులు... వేషాలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 07,2023

ఏడ్పులు... వేషాలు

         ఇప్పుడీ బోధేమిటి! భజరంగ దళీయులు మాత్రమే భక్తులా? వేరేవాళ్లు కారా? దేవుళ్లపేరు చెప్పి సానుభూతిని పొందటం కోసం చేసే జిమ్మిక్కులు ఎంతకాలం చేస్తారు? విధ్వంసాలకు, హత్యలకు కూల్చివేతలకు పాల్పడుతున్న వాళ్లు రాముని ఆంజనేయుని భక్తులెలా అవుతారు! చిన్నతనంలో రాముని, కృష్ణుని, ఆంజనేయుని, భాగవత వేశాలేసుకుని, ఇంటింటికీ తిరిగి పద్యాలు పాడి అడుక్కుని బతుకుదెరువు గడుపుకునేవారు. వీళ్లు మాత్రం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, భక్తుల పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ వేశాలను దొంగ ఏడ్పులను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి.
         'నను మనసారా ఏడ్వనీయండి' అని కృష్ణశాస్త్రిగారు అప్పుడెప్పుడో తీవ్రంగా దుఃఖపడ్డాడు. ఏడ్పులు నానారకాలుంటాయి. బాధను కన్నీళ్లుగా చేసి బరువుదించుకోవటం ఒక విధం. ఏడ్చి పనులు నెరవేర్చుకోవటాన్ని తరచూ చూస్తూంటాం. రామాయణంలో కైకేయి అలక మందిరంలో ఏడుస్తూ ఉందని తెలుసుకున్న దశరథుడు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె కోర్కెను తీరుస్తాడు. రామునికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చేస్తాడు. రామున్ని అడవులకూ పంపిస్తాడు. కైకేయి ఏడుపు అదన్నమాట. అశోకవనంలోని సీత దుఃఖమూ మనకు తెలుసు. ఆకలితో బాధపడే వాడి దుఃఖానికీ, కోరుకున్నది లభించకపోతే వచ్చే ఏడుపునకు చాలా వ్యత్యాసముంటుంది. చిన్న పిల్లలు తాము కోరుకున్నది ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు. ఆ తర్వాత వెంటనే ఏడుపు ఆపేస్తారు. ఇంకొందరికి తమకు లేకపోయినా ఎదుటివానికి ఉన్నదనే ఏడుస్తుంటారు. ఇదో రకం ఏడుపు. కొందరికి లేదని ఏడుపుంటే మరికొందరికి ఉన్నందుకూ ఏడుపుం టుంది.
ఏడుపంటే ఓ కథ గుర్తుకొచ్చింది. క్రౌంచపక్షుల జంటలో ఒక పక్షిని చంపేయటంతో దుఃఖిత పక్షిని చూసిన వాల్మీకి రామాయణాన్ని రాశాడు. నారదునికి కథను వినిపించగా కావ్యం బాగానే ఉంది కానీ... నీవు రాసిన దానికంటే హనుమంతుడి రామాయణం చాలా బాగుంటుంది అని అంటాడు. కావాలంటే కదళీవనానికి వెళ్లి హనుమంతుని కలువమని సలహా ఇస్తాడు. వాల్మీకి వనానికి వెళ్లి అక్కడ అరటాకుల మీది రామకథను చదువుతాడు. చదవడం పూర్తవగానే పెద్దగా ఏడ్వడం మొదలు పెడతాడు వాల్మీకి. మహర్షి ఏడుస్తున్నాడని తెలుసుకున్న హనుమ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. మీరు రాసిన రామాయణం అద్భుతంగా ఉన్నదని, అందువల్ల ఏడుపు వస్తున్నదని వాల్మీకి జవాబిస్తాడు. బాగుంటే సంతోషించాలి గానీ ఏడవడం ఎందుకు? అంటాడు. హనుమంతుని రామాయణం చదివాక తన రచనను ఎవ్వరూ చదవరని, అందుకే ఏడ్పువచ్చిందని వాల్మీకి అంటాడు. వెంటనే హనుమ అరటాకులనన్నింటినీ చింపివేస్తాడు. ఎందుకలా చేశారు? మధురమైన రామకథ చెరిగిపోయింది కదా! అని ఆవేదన చెందుతాడు వాల్మీకి. దానికి బదులుగా హనుమ 'ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకోవటానికి మీరు రామాయణం రాశారు. నేను రాముణ్ని గుర్తుంచుకోవటానికి రాశాను' అని చెప్పి వాల్మీకి కండ్లు తెరిపిస్తాడన్న కథ ఉంది. అందుకని ఇలాంటి ఏడుపులూ కొందరు రాతగాళ్లలో ఉంటాయి.
ఆ ఏడుపులెట్లున్నా మనముందూ కొందరేడుస్తున్నారు. వాళ్ల ఏడుపేమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి కర్నాటక ఎన్నికల్లో ఏడ్చినంత పనిచేస్తున్నారు. నన్ను ప్రతిపక్షాలు తొంభైసార్లు తిట్టారని ఓటర్లకు చెప్పుకొని ఏడ్చేశారు. ఇది ఓట్లను రాల్చేసుకోవటానికి ఏడ్చే ఏడుపు. చిన్నతనంలో అన్నదమ్ములం, అక్కా చెళ్లెళ్లతో తగాదాపడి, అమ్మకో నన్నాకో వీడు తిట్టాడని, కొట్టాడని చెపుతూ ఏడ్చేవాళ్లం. లేదా పక్కింటి మిత్రుడు తిట్టాడనీ ఏడ్చేవాళ్లం. అచ్చం అలా అనిపిస్తున్నది. దేశంలోని రైతుల, కార్మికుల, పేదల, ఆర్తుల మహిళల, పిల్లల ఏడ్పులను విని, వారి బాధలను తీర్చాల్సిన నాయకుడు, వాళ్ల ఏడుపును పట్టించుకోకపోగా తన గురించిన బాధల్ని చెప్పుకు ఏడ్వటం మొదటిసారిగా చూస్తున్నాం! ఈ ఏడుపు వెనకాల అధికారం పొందాలన్న వాంఛతప్ప మరేమీలేదు. మా మానప్రాణాలు కాపాడండి మహా ప్రభో అని ఢిల్లీ నడివీధిలో మహిళా మల్లయోధులు ఏడుస్తూ అర్థిస్తుంటే, కనీసం ఆలకించని పాలకుడు, తన కోసం తాను ఏడుస్తూండటం వింత చర్య. పాలకులెవరైనా తాము చేసిన పనిని, చేయబోయే పనిని, ప్రజలకు ఏమి అందిస్తారో అని చెప్పి సాధారణంగా ఓట్లు అడుక్కోవటం ఉంటుంది. ప్రజలకేం ఇస్తారో చెపుతారు. కానీ ఈ ఏడుపు గొట్టు నాయకుడు హనుమంతున్ని తలుచుకొని ఓటేయమంటున్నాడు. హనుమాన్‌ చాలీసాను చదవమంటున్నాడు. కొన్ని తరాలుగా ఈయన పుట్టక ముందు నుండే ప్రజలు ఆంజనేయున్ని పూజిస్తున్నారు. హనుమాన్‌ చాలీసా చదువుతూనే ఉన్నారు. ఇప్పుడీ బోధేమిటి! భజరంగ దళీయులు మాత్రమే భక్తులా? వేరేవాళ్లు కారా? దేవుళ్లపేరు చెప్పి సానుభూతిని పొందటం కోసం చేసే జిమ్మిక్కులు ఎంతకాలం చేస్తారు? విధ్వంసాలకు, హత్యలకు కూల్చివేతలకు పాల్పడుతున్న వాళ్లు రాముని ఆంజనేయుని భక్తులెలా అవుతారు! చిన్నతనంలో రాముని, కృష్ణుని, ఆంజనేయుని, భాగవత వేశాలేసుకుని, ఇంటింటికీ తిరిగి పద్యాలు పాడి అడుక్కుని బతుకుదెరువు గడుపుకునేవారు. వీళ్లు మాత్రం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, భక్తుల పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ వేశాలను దొంగ ఏడ్పులను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'జన్‌ధన్‌' కనుమరుగయ్యెన్‌
తాను తీసుకున్న గోతిలోనే...
ప్రేమను పంచుదాం...
చెంపపెట్టు...
ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!
గొయ్యిని పూడ్చేదెవరు?
మణిపూర్‌... మరో రోమ్‌
దాచేస్తే దాగని సత్యం!
ఎ ఫిల్మ్‌ బై 'సంఘ్‌పరివార్‌'
రెచ్చగొట్టే పశ్చిమ దేశాల మరో దుష్టయత్నం!
కర్‌'నాటక' ఎజెండా!
వన్‌ వే ట్రాఫిక్‌
సూడాన్‌లో మనోళ్లు సురక్షితమేనా?
ఎర్రెర్ర‌ని దారుల్లో‌
సిగ్గు సిగ్గు!
ఆ తీర్పుపై నీళ్లు..!
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి చైనా చొరవ!
బిల్లులపై ఇదేం పద్ధతి..?
సైన్స్‌పై దాడి
ప్రపంచ గూఢచారి!
''నేరం'' విడుదల!
జనాభాలో చైనాను అధిగమిస్తే ఒరిగేదేమిటి?
'పుల్వామా'లో అసలేం జరిగింది?
'లైవ్‌ కిల్లింగ్స్‌'
'సిగ్గు'కే సిగ్గేసింది!
కళ నిజమౌనులే !
రంజాన్‌ మాసంలో శుభ పరిణామాలు!
సజీవుడు అంబేద్కర్‌!
మళ్లీ 'ఉరే'నియం...
నిఘా నీడలో...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.