Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కళ నిజమౌనులే ! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 16,2023

కళ నిజమౌనులే !

''ఉందిలే మంచీకాలం ముందూముందూనా
అందరూ సుఖపడాలీ నందానందానా...''
ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం ''రాముడు భీముడు'' సినిమా కోసం మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ పాట... అసంఖ్యాకమైన శ్రామిక ప్రజల ఆకాంక్షలకు ప్రతీక. నిజంగా ప్రజలందరూ శాంతీ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లే రోజులొస్తాయా...? అంటే అదే ప్రకృతిధర్మమూ సహజన్యాయమూ అయినప్పుడు ఎందుకురాదు! మానవ సమాజం తన సుదీర్ఘ జీవనగమనంలో అలాంటి ఒక దశను దాటుకొనే వచ్చింది.
ఈ భూమ్మీద ఏ రాజ్యమూ రాజులూ లేని కాలమది. సమస్త ప్రకృతి వనరుల మీద శ్రమించే మనుషులకే సర్వహక్కులు. నాడు ఆస్తులు కూడబెట్టుకోవాలన్న ఆశలేదు. రేపటి కోసం ఇవాల్టి కాలాన్ని వెచ్చించాలన్న ఆలోచనే లేదు. నీ...నా అనే భావనేలేని రోజులవి. మనుషులందరూ జీవితం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సమిష్టిగా పాటుపడ్డారు. నిప్పుని కనిపెట్టినవాడు దానిమీద పేటెంట్‌ హక్కుని అడగలేదు. దుక్కినిదున్నిన వాళ్ళు నాగలి కర్రు మీద తమ పేరే ఉండాలని కోరలేదు. రాజ్యమే లేదు కాబట్టి రాజ్యం వీరభోజ్యం అనే మాటలకు అసలు తావే లేదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. కానీ కాలం గడుస్తున్నకొద్దీ సౌకర్యాలు, సౌలభ్యాలతో పాటు సంపద కూడా పెరిగి ఆస్తులు ఏర్పడ్డాయి. ఆపైన వాటిమీద హక్కుదారులు పుట్టుకొచ్చారు. దీనినే ''బలవంతులు దుర్జలజాతిని బానిసలను కావించారు'' అని ఎత్తిచూపాడు శ్రీశ్రీ. అది మొదలు మానవ సమాజంలో ఆనందమే లేకుండా పోయింది.
ఇంతకీ ఆనందమంటే ఏమిటీ? ఇది తెలియకుండా మనం ఆనందాన్ని పొందలేం. ఇక్కడే మనకు ఒకటో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తత్వవేత్త సెనెకా గుర్తుకొస్తాడు. నిజమైన ఆనందం అంటే భవిష్యత్తు గురించి బెంగ లేకుండా వర్తమానంలో హాయిగా ఉండటం అంటాడు ఆయన. కానీ మనుషులు అలా ఉండలేకపోవడమే నేటి విషాదం. ఎందుకంటే మన శతాబ్డాల పరిణామక్రమంలో ఎన్నడూ ఎరుగనంత అనిశ్చితితో కూడిన కాలమిది. ఈ ఇరవయ్యోకటో శతాబ్దంలో మానవజీవితం మరింత సంక్లిష్టమైంది. ప్రపంచ మానవాళిలో ఏ పూటకు ఆ పూట వెతుక్కోవాల్సిన అసంఖ్యాకులైన పేదలే కాదు, అన్నీ సమకూరిన అపర కుబేరులు కూడా భవిష్యత్తు గురించి యోచిస్తూ వర్తమానాన్ని ఆనందాలకు దూరం చేసుకుంటున్నారు. రేపటిని గురించిన బెంగతో తీవ్రమైన ఒత్తిడితో శాంతిలేని జీవితాలను గడుపుతున్నారు.
పాలకులు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటిల నిర్ణయాలు, కుట్రపూరిత వ్యవహారాలతో గడపడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినవారు తాము చేయాలనుకున్న పనులు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మరో అయిదేండ్ల తర్వాత కూడా అధికారంలోకి రావడమెలా అనే ఆలోచనలు చేసే కృతకమైన రాజకీయ వ్యవస్థను సాగిస్తున్నారు. పదవుల్లోకి వచ్చి ఆ పదవులు నిలుపుకోడం, తిరిగి ఆ పదవుల్లో కొనసాగడం కోసం సంపాయించుకోవడమే పనిగా బతికేవారు ప్రజలకు ఏం మేలు చేస్తారు. అదలా వుంచితే ఇప్పుడు సామాన్యులు, సంపన్నులు, పాలకులు అందరూ నిరంతర అభద్రతలో సతమతమవుతున్నారు. కొందరిది న్యాయమైన ఆశ, ఇంకొందరిది స్వార్థపూరితమైన దురాశ, మరికొందరిది అవాంఛనీయమైన అధికారవాంఛ. ఇలాంటి సమాజంలో సంతోషమెలా ఉంటుందీ ఎందుకుంటుందీ? కనుకనే ఇక్కడ బాల్యం, కౌమారం, యవ్వనం సైతం సంక్షుభితమైపోయింది.
ఈ దురవస్థ గురించే సెనెకా చెప్పాడు. ఎప్పుడయితే రానున్న రోజులు ఎలా ఉంటాయోనని భీతిల్లుతారో అప్పుడు వర్తమానంలో హాయిగా ఉండలేరు. హాయిగా ఉండటం తెలియకపోతే ఆనందంగా జీవించడమూ తెలియదు. మన చుట్టూరా సమస్యలు, సవాళ్ళు, సంక్లిష్టతలు ఎన్నో. ఇప్పుడు వీటిని ఛేదించడమెలాగో తెలుసుకోవాలి. ఆనందమయమైన మరోప్రపంచ నిర్మాణానికి మార్గాలు అన్వేషించాలి. ఆ మార్గంలో ప్రయాణిస్తూనే మన చుట్టూ జరిగే అనేక చిన్నచిన్న విషయాలు కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాయని గమనించాలి. వాటిని అనుభవంలోకి తీసుకుని అనుభూతి చెందాలి. ఉదాహరణకు సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల రాత్రులు, నదీ ప్రవాహాల వంటి ప్రకృతి సోయగాలు మనల్ని పరవశానికి లోనుచేస్తాయి. వాటిని ఆస్వాదించగలగాలి. అన్నిటికీ మించి మనిషి సంఘజీవి. కనుక సాటి మనుషుల్ని ప్రేమించడంలో గొప్ప ఆనందముంటుందన్న సామాజిక జీవన సూత్రం సదా ఎరుకలో ఉండాలి. మనుషులంతా ఒక్కటేననే మానవీయత హృదయంలో నిండి ఉండాలి.
కానీ ఈ వ్యవస్థ అలా ఉండనీయదు. మార్కెట్‌ మనుషుల్ని మాయ చేస్తుంటుంది. మతం మనుషుల్ని విడదీస్తుంది. రాజ్యం జీవించే హక్కుల్నే కూలదోస్తుంది. ఇప్పుడీ మూడూ జమిలిగా ఈ దేశ మౌలిక స్వభావానికే ముప్పు తెస్తున్నాయి. మనిషిని కనిపించని సంకెళ్లలో బంధించే కుట్రలు చేస్తున్నాయి. వీటిని ఛేదించడం ద్వారా మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలం. అందుకే పై పాటలో చెప్పినట్టు... ''అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి'' అన్నట్టుగా పోరాడితే మంచిరోజులు అసాధ్యమేమీ కాదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'జన్‌ధన్‌' కనుమరుగయ్యెన్‌
తాను తీసుకున్న గోతిలోనే...
ప్రేమను పంచుదాం...
చెంపపెట్టు...
ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!
గొయ్యిని పూడ్చేదెవరు?
మణిపూర్‌... మరో రోమ్‌
దాచేస్తే దాగని సత్యం!
ఏడ్పులు... వేషాలు
ఎ ఫిల్మ్‌ బై 'సంఘ్‌పరివార్‌'
రెచ్చగొట్టే పశ్చిమ దేశాల మరో దుష్టయత్నం!
కర్‌'నాటక' ఎజెండా!
వన్‌ వే ట్రాఫిక్‌
సూడాన్‌లో మనోళ్లు సురక్షితమేనా?
ఎర్రెర్ర‌ని దారుల్లో‌
సిగ్గు సిగ్గు!
ఆ తీర్పుపై నీళ్లు..!
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి చైనా చొరవ!
బిల్లులపై ఇదేం పద్ధతి..?
సైన్స్‌పై దాడి
ప్రపంచ గూఢచారి!
''నేరం'' విడుదల!
జనాభాలో చైనాను అధిగమిస్తే ఒరిగేదేమిటి?
'పుల్వామా'లో అసలేం జరిగింది?
'లైవ్‌ కిల్లింగ్స్‌'
'సిగ్గు'కే సిగ్గేసింది!
రంజాన్‌ మాసంలో శుభ పరిణామాలు!
సజీవుడు అంబేద్కర్‌!
మళ్లీ 'ఉరే'నియం...
నిఘా నీడలో...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.