Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెంపపెట్టు... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 13,2023

చెంపపెట్టు...

           గవర్నర్ల వ్యవస్థకి సంబంధించిన ఈ రెండు తీర్పులూ కేంద్రానికి పరోక్ష హెచ్చరికల్లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకల్లాంటివి.బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడం, కుదరకుంటే ఇబ్బం దులకు గురిచేయడం, ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడవడం కేంద్రానికి ఓ విధానంగా సాగుతోంది. ఇందుకు గవర్నర్‌ల వ్యవస్థను అడ్డుపెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పాలకపక్షానికి వత్తాసు పలికే గవర్నర్‌ల వ్యవహార శైలికి ఈతీర్పు చెంపపెట్టులాంటిది.
            సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన రెండు తీర్పులు కేంద్రానికి చెంపపెట్టులాంటివి. అందులో ఒకటి ఢిల్లీలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం అంశం కాగా, రెండోది మహారాష్ట్రలో గవర్నర్‌ వ్యవహార శైలికి సంబంధించినది. అయితే ఈ రెండు తీర్పులూ గవర్నర్ల వ్యవస్థను వెలేత్తిచూపేవిగానే ఉన్నాయి. అయితే తెరవెనక కథ నడిపే కేంద్రమే అసలు దోషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న లెప్టినెంట్‌ గవర్నర్‌ వ్యవహారంగానీ, మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో గవర్నర్‌ కోష్యారి ఏకపక్ష వైఖరి గాని కేందం కనుసన్నులలో అక్కడి ప్రభుత్వాలను అస్తిరపరిచేవిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే.ఈ తీర్పులు దాన్ని మరింత బహిర్గతపరిచే అంశాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రధానంగా ఢిల్ల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎన్నికైనప్పటినుంచి ఏదోరకంగా కేంద్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే చేస్తోంది. ఢిల్లీ పాలనాధికారులు ఎవరి పరిధిలో పనిచేయాలి?అనే విషయమై అనేకమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి.
సాధారణంగా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఆయా రాష్ట్రాల అధికారులు అమలు జేయాలి. కానీ, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం గనుక ఆ సూత్రం వర్తించదన్నది కేంద్రం వాదన. దేశ రాజధానిలో రాష్ట్రపతి, ప్రధాని, విదేశీ రాయబారుల వంటి సెలబ్రెటీలు నివసిస్తారు గనుక వారి శాంతిభద్రతలు తామే చూస్తున్నాం గనుక పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం తమదేనని అంటోంది. దానికి సంబంధించి 2015లో ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ విషయమై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. 2019లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ అప్పీ లుకు వెళ్లగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ నేతత్వంలోని ధర్మాసనం తాజాగా కీలకమైన తీర్పునిచ్చింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కట్టుబడి ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది.దీనికితోడు పాలనా సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదంటూ ద్విసభ్య ధర్మా సనంలోని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక విజయం.
ఇక మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించిన విషయంలోనూ అప్పటి గవర్నర్‌ వ్యవహరించిన తీరును కోర్టు తప్పుపట్టింది.రాష్ట్ర శాసనసభలో బలాబలాల పరిస్థితి తెలుసుకోకుండా, బలపరీక్ష కోరడం అనైతికమని తేల్చింది. ఈ కేసులో అప్పుడున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేను బలపరీక్షను కోరే ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని గవర్నర్‌ అంచనా వేయడంలో విఫలమయ్యారని స్పష్టం చేసింది. గవర్నర్‌ది తప్పని సుప్రీంకోర్టు మందలించినా ఇదేమీ తనను శిక్షించినట్టు కాదని కోష్యారి ప్రకటించడం వెనుక అంతర్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. నడిపించేదంతా నాయకులైనప్పుడు ఇలాంటి వారంతా తప్పు చేసి కూడా తమదేం లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. కోష్యారి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఆయన అవివేకమనిగాక ఇంకేమనుకోవాలి?ఉద్దవ్‌ థాక్రే కూడా తొందర పాటు నిర్ణయం తీసుకున్నారని, పార్టీ చీలిక నేపథ్యంలో బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడం వల్ల ఆయన రాజీనామాను రద్దుచేసి, మళ్లీ ముఖ్యమంత్రిగా చేయలేమని కోర్టు పేర్కొంది. రాజీనామా చేయకుండా థాక్రే సంయమనం పాటించి వుంటే ఆయన్ని తిరిగి సీఎంగా కూర్చోబెట్టవచ్చని చెప్పింది. అయితే తీర్పుననుసరించి థాక్రే గ్రూపునకు చెందినవారు షిండేను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఇది కొంతకాలం మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత నిప్పురాజేసే అవకాశాలున్నాయి.
గవర్నర్ల వ్యవస్థకి సంబంధించిన ఈ రెండు తీర్పులూ కేంద్రానికి పరోక్ష హెచ్చరికల్లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకల్లాంటివి.బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడం, కుదరకుంటే ఇబ్బందులకు గురిచేయడం, ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడవడం కేంద్రానికి ఓ విధానంగా సాగుతోంది. ఇందుకు గవర్నర్‌ల వ్యవస్థను అడ్డుపెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పాలకపక్షానికి వత్తాసు పలికే గవర్నర్‌ల వ్యవహార శైలికి ఈతీర్పు చెంపపెట్టులాంటిది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'జన్‌ధన్‌' కనుమరుగయ్యెన్‌
తాను తీసుకున్న గోతిలోనే...
ప్రేమను పంచుదాం...
ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!
గొయ్యిని పూడ్చేదెవరు?
మణిపూర్‌... మరో రోమ్‌
దాచేస్తే దాగని సత్యం!
ఏడ్పులు... వేషాలు
ఎ ఫిల్మ్‌ బై 'సంఘ్‌పరివార్‌'
రెచ్చగొట్టే పశ్చిమ దేశాల మరో దుష్టయత్నం!
కర్‌'నాటక' ఎజెండా!
వన్‌ వే ట్రాఫిక్‌
సూడాన్‌లో మనోళ్లు సురక్షితమేనా?
ఎర్రెర్ర‌ని దారుల్లో‌
సిగ్గు సిగ్గు!
ఆ తీర్పుపై నీళ్లు..!
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి చైనా చొరవ!
బిల్లులపై ఇదేం పద్ధతి..?
సైన్స్‌పై దాడి
ప్రపంచ గూఢచారి!
''నేరం'' విడుదల!
జనాభాలో చైనాను అధిగమిస్తే ఒరిగేదేమిటి?
'పుల్వామా'లో అసలేం జరిగింది?
'లైవ్‌ కిల్లింగ్స్‌'
'సిగ్గు'కే సిగ్గేసింది!
కళ నిజమౌనులే !
రంజాన్‌ మాసంలో శుభ పరిణామాలు!
సజీవుడు అంబేద్కర్‌!
మళ్లీ 'ఉరే'నియం...
నిఘా నీడలో...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.