Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రామ! రామ! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 02,2023

రామ! రామ!

రామ, రామా అని నోటి మీద చెయ్యిపెట్టుకుని విస్తుబోయి అన్యాయం, అధర్మం అని అనుకుంటే సరిపోదు. గొంతులిప్పి నిలేయికపోతే వీరి ఆగడాలు మరింత పెరిగే ప్రమాదముంది. మొన్న శ్రీరామనవమి రోజున రాములవారి కళ్యాణము జరిగింది. భక్తులు, సామాన్య ప్రజలు వేడుకగా ఈ కార్యక్రమాన్ని సంప్రదాయంగా చేసుకున్నారు. ఇదేమీ కొత్తకాదు. ప్రతియేడూ జరుగుతున్నదే. చిన్నతనంలో రామనవమి పందిరి క్రింద బెల్లం పానకం గ్లాసులకొద్దీ తాగి సరదాగా గడిపిన జ్ఞాపకాలూ ఉన్నాయి. అప్పుడు పందిరిలో చేరిన భక్తుల వదనాల్లో సంతోషమూ, భక్తిభావన, సౌహార్ధత, కరుణ, దానశీలత, సౌమ్యత మొదలైన గుణాలు తొణికిసలాడేవి. ఒక ప్రశాంత శాంతియుత వాతావరణంలో సమ్మేళనం కొనసాగేది. సందడి యెంతున్నా సంయమనం కనిపించేది. కానీ ఇప్పుడేమిటీ ఉద్రిక్త విద్వేషం! నాడు, రామనామస్మరణ, రామదాసు సంకీర్తన, స్వరమాధుర్యాలు సంబరాలను సమున్నత పరచేవి. ఆరాధనా భావన అల్లుకొనేది. రాముని చరిత్రా, కథా, ప్రవచనాలు, గీతాలూ వినిపించేవి.
ఇప్పుడిదేమిటి? రామ! రామ! రాముడి పెండ్లిరోజు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొల్పటమా! రెచ్చగొట్టే ప్రసంగాలు, బూతులు, తిట్లు, పలకటానికి కూడా వీలులేని దుర్మార్గ ప్రేలాపనలు, ఒక ఉన్మత్త విన్యాసం భక్తి పేరున కొనసాగటమా! శోభాయాత్ర పేరుతో సాగిన ఊరేగింపులు శత్రువులపై యుద్ధ యాత్రలుగా మార్చిన తీరు చూస్తే, ఇది పూర్తిగా విద్వేష ప్రచారయాత్రలుగా కనపడుతున్నాయి. హైదరాబాద్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నాయకత్వాన సాగిన శ్రీరాముడి శోభాయాత్రలో రాముని స్మరణగానీ, భక్తికానీ కించిత్‌ కనిపించదు, వినిపించదు. కానీ వినిపించినవి ఏమిటంటే బూతులు, యాత్రావేదికపై నుండి రెచ్చగొట్టే విధంగా ఉద్రిక్తంగా బెదిరింపులు చేయటం ఇక్కడి భక్తులకు రాముడికీ అవమానకరంగా మారింది. అంతేకాదు, ఈ యాత్రలో మన జాతిపిత, రామరాజ్యం కోసం కలగన్న మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరాంగాడ్సే చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఊరేగటం ఎంత దారుణం! ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటమే మాలక్ష్యం అంటూ అడ్డొచ్చే వారిని అంతమొంది స్తామని హెచ్చరిస్తూ సాగిన శోభాయాత్ర, భక్తి పూర్వక యాత్ర ఎలా అవుతుంది. నీచమైన బుద్ధితో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం కోసం రామనామాన్ని వాడుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒకవైపు దోపిడీ దొంగలను దొంగలని అన్నందుకు పదవులకు అనర్హత ప్రకటిస్తారు. మరోవైపు హంతకులను ఊరేగించే నాయకులకు కితాబులిస్తారు! ఇదేమి న్యాయం? ఇదెక్కడి దుర్మార్గం? ఈ విచ్ఛిన్నకులకు శిక్షలు లేవా? మతాన్ని రాజకీయాలను కలిపేసి ఉన్మాదాన్ని ఎగదోసే ఇట్లాంటివారి పట్ల ఎందుకు ఈ ఉదాసీనత! రాజ్యాంగం ప్రకారం మనదేశం లౌకిక ప్రజాస్వామిక దేశం. దీన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తామని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లడుతుంటే నేరం కాదా! భక్తి కొనసాగే సందర్భంలో మతాలపై ద్వేషాన్ని ఉసిగొల్పటం నేరపూరితం కాదా!
ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమనిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై మాట్లాడుతూ, రాజకీయాలు, మతాలను వేరుచేయాలని సుప్రీం వ్యాఖ్యానించింది. నాయకులు రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం ఆపాలని, అప్పుడే విద్వేష ప్రసంగాలు ఆగుతాయని పేర్కొంది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదు చేయడంలో విఫలమయ్యారని మహారాష్ట్ర సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలపై కోర్టు ధిక్కరణ కేసు సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ... నాయకులు రాజకీయాలను మతంతో కలిపేయడం వల్ల పెద్ద సమస్య ఉత్పన్నమైందని నొక్కివక్కాణించారు. ఈ కోర్టు వ్యాఖ్యలను పట్టించుకోవటం చేస్తారా లేదా! ''కేవలం తుపాకీలతో కాల్చడం, బాంబులను పేల్చడం ఉగ్రవాదం కాదు, మతాలుగా, కులాలుగా ప్రజలను విభజించడం కూడా అతి భయంకరమైన ఉగ్రవాదం'' అని బాలీవుడ్‌ నటుడు చెప్పిన విషయం అక్షరాలా వాస్తవం. కేవలం ఇంటి పేరు ప్రస్తావనలకే పరువునష్టం జరిగితే, ఒక జాతిపితను చంపినవాడిని దేశభక్తుడని కీర్తిస్తున్న సంఘటన దేశ ప్రజల మనోభావాలు, పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాదా! కోట్లాది ప్రజల మనసులను గాయపరచడం కాదా! గాంధీ కూడా నిత్య రామస్మరణ చేసినవాడన్న విషయం మరువరాదు.
సామరస్యతకు, సౌహార్ధతకు, సహనశీలతకు, దయ కరుణ, సౌభాతృత్వాలు వెల్లివెరియాల్సిన ఉత్సవాలను, పండుగలను, విద్వేష పూరితం చేస్తున్న ఉన్మాద ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశంలో అన్య మతస్తులు పరిపాలనలో ఉన్నప్పుడూ పండుగలు, ఉత్సవాలూ ప్రశాంతంగానే కొనసాగాయి. ఇప్పుడీ దేశంలోని మతానికి ఎదురవుతున్న ప్రమాదమేమీలేదు. ఉన్నదల్లా ప్రజల బాధలు తీర్చకుండా మతోన్మాదాన్ని, ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న వారితోనే అసలైన ముప్పు ఎదురవుతున్నది. వారి పట్లనే భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'జన్‌ధన్‌' కనుమరుగయ్యెన్‌
తాను తీసుకున్న గోతిలోనే...
ప్రేమను పంచుదాం...
చెంపపెట్టు...
ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీం ఆదేశం!
గొయ్యిని పూడ్చేదెవరు?
మణిపూర్‌... మరో రోమ్‌
దాచేస్తే దాగని సత్యం!
ఏడ్పులు... వేషాలు
ఎ ఫిల్మ్‌ బై 'సంఘ్‌పరివార్‌'
రెచ్చగొట్టే పశ్చిమ దేశాల మరో దుష్టయత్నం!
కర్‌'నాటక' ఎజెండా!
వన్‌ వే ట్రాఫిక్‌
సూడాన్‌లో మనోళ్లు సురక్షితమేనా?
ఎర్రెర్ర‌ని దారుల్లో‌
సిగ్గు సిగ్గు!
ఆ తీర్పుపై నీళ్లు..!
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి చైనా చొరవ!
బిల్లులపై ఇదేం పద్ధతి..?
సైన్స్‌పై దాడి
ప్రపంచ గూఢచారి!
''నేరం'' విడుదల!
జనాభాలో చైనాను అధిగమిస్తే ఒరిగేదేమిటి?
'పుల్వామా'లో అసలేం జరిగింది?
'లైవ్‌ కిల్లింగ్స్‌'
'సిగ్గు'కే సిగ్గేసింది!
కళ నిజమౌనులే !
రంజాన్‌ మాసంలో శుభ పరిణామాలు!
సజీవుడు అంబేద్కర్‌!
మళ్లీ 'ఉరే'నియం...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.