- అర్థంతరంగా తమను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయి..
- తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు...
నవతెలంగాణ డిచ్ పల్లి.
శిక్షణ కేంద్రాన్ని నమ్ముకొని 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, అర్థంతరంగా తమను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తాత్కాలిక ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. డిచ్ పల్లి మండలంలోని ఘన్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని (టీటీడీసీ) ట్రైంజం సెంటర్ లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు వీరయ్య, అన్వర్, మల్బ,సునీత లను తొలగించారు. ఈ శిక్షణ కేంద్రం డీఆర్ డీఏ అధ్వర్యంలో గత 20 ఏళ్లుగా కొనసాగుతుందని, ఆనాటి నుండి నేటి వరకు రోజు తిరిక లేకుండా శిక్షణలు కొనసాగేవన్నరు. వందలాది మంది శిక్షణల కోసం ఉమ్మడి జిల్లాల నుండి వచ్చేవారని,ఇది మిని కలెక్టర్ గా అందరు పిలిచే వారని, జిల్లాలో వీధులు నిర్వహించిన అనేక మంది కలెక్టర్లు అత్యధిక సమయం ట్రైజం సెంటర్లో నే ఉండి సమీక్షలు, సమావేశలు నిర్వహించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దింతో ట్రైంజం సెంటర్ బాగోగుల ను చుడటనికి, పరిశుభ్రంగా ఉంఉంచడాని కి అనాడు ఐదుగురు సిబ్బందిని తాత్కాలికంగా తీసుకున్నారని, కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు, అనంతరం కరోనా, ఇతర సమస్యల వల్ల శిక్షణ కేంద్రంలో శిక్షణలు పూర్తిగా తగ్గిపోయాయి. శిక్షణల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ కేంద్రాన్ని నిర్వహించేవారని వారన్నారు.ప్రస్థుతం నెలకు ఒకటి, రెండు శిక్షణలు మాత్రమే కొనసాగుతుండటంతో నిర్వహణ భారంగా మారి ఉన్నవారందరిని తోలగించారని పేర్కొన్నారు.తమందరము శిక్షణ కేంద్రాన్ని నమ్ముకొని 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, అర్థంతరంగా తమను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు వాపోయారు. రూ.300 వేతనంతో ప్రారంభమైన తాము ప్రస్తుతం రూ. ఆరువేల వేతనంతో పనిచేస్తున్నామని, శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారని నమ్ముకొని పనిచేశామని చెప్పారు. తమను నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సర్దుబాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. నిధుల కొరతతోనే వారిని తొలగించినట్లు ట్రైజం సెంటర్ ఇంచార్జీ నర్సింహులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 May,2023 07:04PM