నవ తెలంగాణ-గోవిందరావుపేట
దైవాంగులైన వికలాంగులకు మానవత్వంతో ప్రజలు చేయూతనివ్వాలని పసర ఎస్ ఐ సిహెచ్ కర్ణాకర్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని బుస్సాపురం గ్రామంలో వికలాంగ దంపతుల బ్రతుకు దెరువు కోసం దాతలు నిర్మించిన కూల్ డ్రింక్ షాపును ఎస్సై కరుణాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై కరుణాకర్ రావు మాట్లాడుతూ కొమ్మ కోమల-శ్రీనివాస్ (భార్య భర్తలు ఇద్దరు వికలాంగులు) శివన్సీ కూల్ డ్రింక్ జనరల్ స్టోర్ ను దాతల సహాయంతో నిర్మించు కోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. వికలాంగులకు చేయూత నివ్వడం వారికి అండగా ఉన్నాం అని భరోసా కలిగించడం, బలపర్చి ఆత్మ విశ్వాసంతో నింపడం అన్నింటికి మించి ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పాటు అందించడం చాలా మంచి మానవత్వాన్ని అందించడం గొప్ప ఆలోచన అన్నారు.ప్రతి కంఠం రవీందర్రాజు కోమల శ్రీనివాస్ లకు ఏదో విధంగాసహాయం చేయాలని మానవత్వం కలిగి ఆలోచన చేసి వారి పిల్లలు వారాహి మాన్స్(18 నెలలు), శివన్సీ (5 నెలలు) కుమారులు చూసి బ్రతుకుదేరువు కొరకు చిన్న డబ్బా పెట్టుకొని బుస్సపూర్ జీవనం సాగిస్తున్నారు అని వారికి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ పోషణ భారంగా ఉంది అని తెలుసుకోని తోడ్పాటు అందించాలని మంచి ఆలోచన చేసి స్నేహితులు సంసాని మహేందర్ రెడ్డి,నిమ్మగడ్డ సతీష్,యర్ల గడ్డ నాగేశ్వరరావు,ఎండీ యూసఫ్,సుడి ఇంద్ర రెడ్డి లతో మాట్లాడి వారి పరిస్థితి తెలియజెప్పి సుమారు లక్ష రూపాయలతో షెడ్డును నిర్మాణం ఇవ్వడం నిజంగా నిజమైన శుభ పరిమాణం అన్నారు. ఈరోజు పట్టి షాపును ప్రారంభించుకుకోవడం జరిగింది.వారికి తోటి స్నేహితులకు అందరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. సమాజంలో వికలాంగులుకు చేయుతనివ్వడానికి జాలితో కాకుండా మానవత్వంతో ముందుకు రావాలని పసర ఎసై కరుణాకర్ పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో ధాతలు ప్రతి కంఠం రవీందర్,కంసాని మహేందర్ రెడ్డి,నిమ్మగడ్డ సతీష్,యార్లగడ్డ నాగేశ్వరరావు, యండి యూసఫ్,సుడి ఇంద్ర రెడ్డి,జిన్నా దినేష్ రెడ్డి,నెమలి బాలకృష్ణ, గ్రామ సర్పంచ్ సింగం శ్రీలత చందు,ఉప.సర్పంచ్ బెతి దేవేందర్ రెడ్డి,బండవల్లి సాంబయ్య, పాశం మాధవ రెడ్డి,యాదవ్ రెడ్డి, పాలెం యాదగిరి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:29PM