నవతెలంగాణ - రామారెడ్డి
మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సోమవారం వేసవి స్పోర్ట్స్, సీఎం కప్ 2023 ఆటలను స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో రాజు మాట్లాడుతూ... ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. దశరథ్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత యువకులకు క్రీడలతో స్నేహాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో పాటు, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంత యువకుల కోసం ఈ ఆటలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దండబోయిన సంజీవ్, ఎస్సై అనిల్, రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజా గౌడ్, వివిధ గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:23PM