నవతెలంగాణ - డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల వీఓఏల సమ్మె 23వ రోజులో బాగంగా తమ డిమాండ్ల సాధన పట్ల నినాదాలు చేశారు. ఇందల్ వాయి వీఓఏ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి సరళ, కె రాము ఈ సందర్భంగా మాట్లాడుతూ వీవోఏలు చాలీచాలని జీతాలతో నెలకు రూ.3900 తీసుకుంటూ బతకడం ఎలా అని,మీ కుటుంబలు పస్తులుంటు కళం వెల్లదీస్తున్నారని, ఇది ఎంత మాత్రం సహేతుకం కాదన్నారు. అ జీతలు కూడా మూడు నెలలు, ఆరు నెలలకోకసారి ప్రభుత్వం చెల్లిస్తుందని, ఆ జీతం మ కుటుంబ పోషణకు ఏ ములన సరిపోదని, ఇప్పటికైన వీవోఎలకు నెలకు రూ.18వేలు జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీమా సౌకర్యం ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను ఇవ్వాలని పేర్కొన్నారు. మా న్యాయమైన డిమాండ్ లను సానుకుల దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని వారన్నారు. మాడిమాండ్లను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .కార్యక్రమంలో ఉధ్యక్షురాలు సువర్ణ, కోశాధికారి మమత, సభ్యులు కవిత, సౌమ్య, అరుణ, స్వప్న,అలేఖ్య, రాధిక, లావణ్య ,భాగ్య, మౌనిక తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 04:21PM