- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నవతెలంగాణ-గంగాధర : వివిధ ప్రాంతాల క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాల పెంపుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో సీఎం కప్ 2023 మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ క్రీడల వల్ల దేహ దారుఢ్యం పెంపుతో పాటు క్రీడాకారుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలని సంకల్పంతో సీఎం కప్ 2023 మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ గ్రామాన ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారన్నారు. క్రీడ నైపుణ్యం ఉన్న క్రీడలు నిర్వహించక, ప్రోత్సాహం లేక కనుమరుగు అవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకాలను ప్రోత్సహించాలని సంకల్పంతో ప్రభుత్వం ఇటువంటి క్రీడాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ప్రతి క్రీడాకారుడు తనలోని ప్రతిభను, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్లో విజేతగా నిలవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, గంగాధర సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పంజాల ఆంజనేయులు, మల్లికార్జున్ తోపాటు క్రీడాకారులు, పీడీలు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ 2023 క్రీడల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడలను పురస్కరించుకొని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:11PM