నవతెలంగాణ-కంటేశ్వర్
ప్రతి వార్డులో ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీయూస్, రీసైకిల్) కేంద్రాలను ఏర్పాటు చేయునట్లు మున్సిపల్ సానిటరి సూపర్వైజర్ యం.హెచ్.ఓ సాజీద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా యం. హెచ్. ఓ సాజిద్ అలీ మాట్లాడుతూ.. ప్రధానంగా నగరంలో ప్రతి వార్డులో రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ కి సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేయ లని ఇందుకు ఆర్.ఆర్.ఆర్. కేంద్రాల గురించి ప్రజాలకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రల వద్ద స్వయం సహాయక సంఘాలకు చెందిన 10 మంది ఉండలని సూచించారు. ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు ఈ కార్యాక్రమం ముమ్మరంగా నిర్వహించడం జరుగుతుందని పొడి చెత్త కు సంబంధించిన అన్ని రకాల ప్లాస్టిక్ వస్తూవులు, వినియోగించిన దుస్తులు, షాంపు కవర్లలనుండి పుస్తకం వరకు ఈ వస్తువులను ఆర్.ఆర్.ఆర్. తీసుకోవలని ప్రతి వార్డు నందు లాబుణ్ నిర్వహించుకోవలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరి సూపర్వైజర్ సాజీద్ అలీ, సానిటరి యస్.ఐ. ప్రశాంత్, సునిల్, నటరాజ్ గౌడ్, ప్రభుదాస్, శ్రీకాంత్, మహిపాల్, సోలోమెన్రాజ్ మరియు మెప్మా సిఓలు, ఆర్సీలు హాజరైయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 05:49PM