- ఏడు పంచాయితీల్లో కలియ తిరిగిన మెచ్చా....
నవతెలంగాణ - అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తలపెట్టిన సుడిగాలి పర్యటన రెండో రోజు మంగళవారం విజయవంతంగా ముగించారు. ఆరు పంచాయితీల్లో ఆయన కలియ తిరిగి పలు అభివృద్ది,ప్రారంభోత్సవాలు కు శ్రీకారం చుట్టారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా, ఎర్రనగ్గి లో అచ్యుతాపురం పంచాయితీ దిబ్బగూడెం,ఎస్.సి కాలని,మద్దికొండ పంచాయితి,జమ్మిగూడెం పంచాయితీ పెన్నాడవారిపాలెం, కేసప్పగూడెం పంచాయితీ రాజీవ్ నగర్,వినాయకపురం పంచాయితీ కమయ్యనగర్(దబ్బతోగు), వినాయకపురం కాలనీ, ఆసుపాక పంచాయితీ ఆసుపాక కాలని,తిరుమలకుంట పంచాయితీ ఉసుర్లగూడెం, పాతరెడ్డిగూడెం, సుద్దగోతులగూడెం గ్రామాల్లో రూ కోటీ 65 లక్షల వ్యయంతో నిర్మించిన 18 సీసీ రోడ్లను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అలాగే ఆ గ్రామాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఆసుపాక పాత ఊరు లో 30 కుటుంబాలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్ నగరం లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు మీటర్లు ఇవ్వలేదని,ఇబ్బందీ పడుతున్నామని లబ్ధిదారులు తెలుపడం తో వెంటనే ఎన్.పి.డి.సి.ఎల్ ఎడీఈ వెంకటేశ్వర్లు కు ఫోన్ చేసి వెంటనే మీటర్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అంతేకాకుండా అక్కడ త్వరలో సీసీ రోడ్డు కూడా మంజూరు చేస్తాననీ తెలిపారు. సుద్దగోతులగూడెం కు తారు రోడ్డు,సీసీ రోడ్డు మంజూరు చేయడం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.అలాగే పై గుంపు కి మంచి నీరు సరఫరా అవడం లేదని తెలపడం తో వెంటనే స్పందించిన ఆయన అక్కడే ఉన్న మిషన్ భగీరథ ఇన్ట్రా ఎఇ లక్ష్మి కి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వరలక్ష్మి,ఎంపీపీ శ్రీరామమూర్తి,వైస్ ఎంపీపీ ఫణీంద్ర, ఆయా పంచాయితీల ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ లు,మండల నాయకులు జెడ్.పి.టి.సి పూర్వ సభ్యులు జె.కే.వీ రమణారావు,మందపాటి రాజమోహన్ రెడ్డి,కాసాని చంద్ర మోహన్,బిర్రం వెంకటేశ్వరరావు, కొనకళ్ళ క్రిష్ణ, కొల్లు చంద్ర శేఖర్, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 04:54PM