నవతెలంగాణ కంఠేశ్వర్
నగరంలోని 4వ టౌన్ పరిధిలో ఈ నెల 12న వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక యువతి మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్, సెల్ ఫోన్ ను దొంగిలించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగర సిఐ వెంకటనారాయణ తెలిపారు. ఆదివారం నగర సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటనారాయణ మాట్లాడుతూ నగరంలోని ఆర్యనగర్ గూడెంకు చెందిన మేకల శ్రావణి అనే యువతి హౌజింగ్ బోర్డు కాలనీ నుంచి వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్ ను, సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీలో దొరికిన పుటేజిల ఆధారంగా వారు దొంగతనానికి యత్నించిన బైక్ ఆధారంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండం వెల్లుట్ల కు చెందిన పశులది చంద్రశేఖర్ ప్రస్తుత నివాసం వినాయక్ నగర్, వినాయక్ నగర్ కు చెందిన బొడిగళ్ల తేజ అనే ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రోల్డ్ గోల్డ్ చైన్ తో పాటు వారు దొంగతనానికి యత్నించిన బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. 24 గంటల్లోనే కేసు చేించిన 4వ టౌన్ ఎస్ హెచ్ వో సందీప్, ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ రమేష్, నీలేష్, వేణులను సిఐ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 09:15PM